మెదక్ రూరల్ నవంబర్ 21 : సైన్స్ విజ్ఞానాన్ని పెంచేందుకు చెకుముకి పోటీలు దోహదపడతాయని మండల విద్యాధికారి మధుమోహన్ అన్నారు. మెదక్ జిల్లోని హవేళి ఘణపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెకుముకి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ వల్ల విద్యార్థుల్లో మేదస్సు పెరుగుతుందన్నారు. స్థానిక పాఠశాల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయు ఆడెపు కరుణాకర్ మాట్లాడుతూ మూఢనమ్మకాలు తొలగేందుకు చెకుముకి పరీక్షలు ఉపయోగపడుతాయని, అందుకై నిరంతరం జరిగే పోటీ పరీక్షలలో విద్యార్థులు పాల్గొనాలన్నారు.
జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.దేవులా మాట్లాడుతూ చెకుముకి పరీక్షలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ, విద్యార్థులలో చైతన్యం తెస్తున్నామన్నారు. చెకుముకి పోటీలలో ఆంగ్ల విభాగంలో ప్రథమ స్థానంలో హవేళిఘణపూర్, ద్వితీయ స్థానంలో కూచన్ పల్లి, తృతీయ స్థానంలో బూర్గుపల్లి తెలుగు విభాగంలో ప్రథమ స్థానంలో బూర్గుపల్లి, ద్వితీయ స్థానంలో కూచన్ పల్లి, తృతీయ స్థానంలో సర్థన విద్యార్థులు విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజశేఖర్, రమేష్, మల్లారెడ్డి, ఉండ్రాళ్ళ రాజేశం, శ్యామల, స్వప్న, మధురాక్షి తదితరులు పాల్గొన్నారు.