రామచంద్రాపురం, జూన్4: భెల్‌లో ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ సినిమా హీరో కిరణ్ అబ్బవరానికి సంబంధించిన సినిమా షూటింగ్ భెల్ అంబేద్కర్ స్టేడియం పరిసరాల్లో శనివారం జరిగింది. ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న సినిమాను ఎస్ఆర్ కల్యాణ మండపం మూవీ డైరెక్టర్ శ్రీధర్గాదే ఈ సినిమాకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్లుగా సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్ నటిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్‌తో ముఖ్యమైన ప్రాతలో బాబా మాస్టర్ నటించనున్నారు. ప్రొడక్షన్‌కు సంబంధించి కోడిరామకృష్ణ కూతురు దివ్యదీప్తి వ్యవహరిస్తున్నారు. రెండు రోజులు పాటు భెల్ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగనున్నది.