Dragon | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి చిత్రాలతో డార్క్ టోన్, రా అండ్ రస్టిక్ విజువల్స్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్ నీల్.. ఈసారి మాత్రం తన మేకింగ్‌లో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన ‘డ్రాగన్’ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ లుక్, బ్యాక్‌డ్రాప్ పూర్తిగా డార్క్, రఫ్ అండ్ రస్టిక్‌గా కనిపించాయి. అయితే సినిమాలోని కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయని సమాచారం. ఈ సన్నివేశాలను మరింత వైబ్రెంట్‌గా, కలర్ఫుల్గా తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ ప్రత్యేకమైన విజువల్ ట్రీట్మెంట్ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కథలోని రెండు వేర్వేరు కాలాలను ప్రేక్షకులకు స్పష్టంగా అర్థమయ్యేలా చేయడానికి కలర్ కాంట్రాస్ట్‌ను ఉపయోగించనున్నట్లు టాక్. ప్రస్తుత కాలానికి సంబంధించిన సన్నివేశాలను ప్రశాంత్ నీల్ తన మార్క్‌కు తగ్గట్టుగా డార్క్ షేడ్స్‌లో చూపించగా.. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో మాత్రం ప్రకాశవంతమైన రంగులు, విభిన్నమైన లైటింగ్, కొత్త తరహా ఫ్రేమింగ్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.ఈ మార్పు కేవలం విజువల్ బ్యూటీ కోసం మాత్రమే కాకుండా.. కథలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కీలకమైన మార్పులను ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడనుందని సమాచారం. ఫ్లాష్‌బ్యాక్‌లోని కలర్‌ఫుల్ ప్రపంచం, ఆ తర్వాత పాత్ర ఎదుర్కొనే చీకటి పరిస్థితుల మధ్య ఉండే వ్యత్యాసం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది.
‘డ్రాగన్’ కథ 1960ల కాలం నాటి గ్లోబల్ మాఫియా, నల్లమందు అక్రమ వ్యాపారం, అంతర్జాతీయ యుద్ధ వాతావరణం చుట్టూ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇప్పటివరకు చేయని విధంగా అత్యంత వైలెంట్, ఇంటెన్స్ మాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని సమాచారం. హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్, అనిల్ కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలు కథలో కీలకంగా ఉండనున్నట్లు టాక్. సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎలివేషన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ కూడా డార్క్ వరల్డ్‌తో పాటు కలర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌కు తగ్గట్టుగా ప్రత్యేకమైన లైటింగ్, ఫ్రేమింగ్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల భుజానికి గాయం కావడంతో ఎన్టీఆర్ సర్జరీ చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకున్న అనంతరం అక్టోబర్ మొదటి వారం నుంచి ‘డ్రాగన్’ రెగ్యులర్ షూటింగ్లో ఆయన తిరిగి పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తారక్ కాంబినేషన్ సన్నివేశాలను ఆయన రాకకు అనుగుణంగా రీషెడ్యూల్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 11న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.