పటాన్చెరు, ఏప్రిల్ 2: బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా వెన్నవరం ఆదర్శ్‌రెడ్డిని అధినేత కేసీఆర్ నియమించారు. మంగళవారం ఎర్రవల్లిలో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్, మాజీ మం త్రులు హరీశ్‌రావు, కేటీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా వెన్నవరం ఆదర్శ్‌రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. ఆదర్శ్‌రెడ్డికి కేటీఆర్, హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పటాన్చెరులో పార్టీని అజేయశక్తిగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. తనపై నమ్మకంతో గురుతర బాధ్యత అప్పగించిన కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఆదర్శ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.