సంగారెడ్డి, జూన్ 4(నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో గెలుపోటములు సహజం. బీఆర్ఎస్ నుంచి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బరిలో నిలవటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశాను. ప్రజలతో మమేకమయ్యాను. నా గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషి చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. నా కోసం ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజాసేవలో మాత్రం నిమగ్నమై ఉంటా.