మనోహరాబాద్, డిసెంబర్ 26: మనోహరాబాద్ మండలంలో ఫైబర్ ఇంటర్నెట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇంటింటికీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలను అం దించడమే లక్ష్యంగా గతేడాది ఈ పనులను ప్రారంభించారు. ఇది వరకే మనోహరాబాద్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సామగ్రిని బిగించారు. ప్రస్తుతం అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటర్నెట్ను కనెక్ట్ చేసేందుకు ఫైబర్ పనులను ప్రారంభించారు.
మొదటి విడతగా మేజర్ గ్రామ పంచాయతీలను లక్ష్యంగా చేసుకొని పనులను మొదలు పెట్టారు. మిషన్ భగీరథ మాదిరిగా ఇంటింటికీ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా పనులను నిర్వహిస్తున్నారు. మిషన్ భగీరత పైపులైన్‌తో పాటు ఫైబర్ ఇంటర్నెట్ వైర్ల కోసం మరో లైన్‌ను అప్పుడే ఏర్పాటు చేశారు. ఈ పనులు పూర్తి అయితే ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ వస్తుంది.