మెదక్ మున్సిపాలిటీ, జూన్ 30: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంతో పాటు రాందాస్ చౌరస్తాలో షాపింగ్ కాంప్లెక్స్ పనులను అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి పరిశీలించి అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు.
పనుల్లో వేగం పెంచాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఆధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రాందాస్ చౌరస్తాలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, తదితరులతో కలిసి పరిశీలించారు. నాణ్యతగా చేపట్టాలని, పనుల్లో వేగం పెంచాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ డీఈ మహేశ్, ఏఈ సాయాగౌడ్ తదితరులు ఉన్నారు.