పాపన్నపేట, డిసెంబర్ 19: ఏడుపాయల వనదుర్గా క్షేత్రంలో ఏడాదిపాటు ఎంటర్టైన్మెంట్ సామగ్రి విక్రయానికి నిర్వహించిన టెండర్ రూ.9. 11 లక్షలకు ఖరారైంది. మంగళవారం ఈవో కార్యాలయంలో టెండర్లు నిర్వహించారు. భక్తులకు ఆహ్లాదకర వస్తువుల విక్రయం, ఎగ్జిబిషన్ ఏర్పాటు టెండర్‌ను రూ.9 లక్షల 11 వేలకు హైదరాబాద్‌కు చెందిన లిఖిత్‌కుమార్ దక్కించుకున్నారు. దేవస్థాన ం వద్ద కొబ్బరికాయలు విక్రయించుకునే హక్కు, ఒడి బియ్యం, కంకణధారణ, కొబ్బరి ముక్కలు పోగుచేసుకునే హక్కు, దేవస్థానం వద్ద పూజా సామగ్రి విక్రయించుకునే హక్కులకు సరైన స్పందన రాకపోవడంతో వాటిని వాయిదా వేసినట్లు ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్ రెడ్డి తెలిపారు.
ఈ వేలంలను తిరిగి ఈ నెల 23న నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మనోహర్, మోహన్‌రావు, సిద్ధిరాములు, వెంకటేశం, పెంటయ్య, సాయిలు, యాదగౌడ్, బాగారెడ్డి, ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్ శర్మ, లక్ష్మీనారాయణ, నరేశ్, మహేశ్, యాదగిరి, బలరాం, తదితరులు పాల్గొన్నారు.