రామాయంపేట, ఫిబ్రవరి 12 : మండలంలోని కోనాపూర్ గ్రామంలో బండపై నిర్మించిన హనుమాన్, శివాలయాల్లో వై భవంగా ఉత్సవమూర్తుల విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు కొన సాగుతున్నాయి. ఆదివారం ఆలయాల్లో హనుమాన్, శివుడు, జ్యోతిర్లింగాలు, నవగ్రహాలు, నాగేంద్రుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. విగ్రహాలతో పాటు ధ్వజస్థంభాన్ని ప్రతిష్ఠించి పూజ లు చేశారు. పూజా కార్యక్రమాలకు ఇఫ్కో డైరె క్టర్ దేవేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో నడవాలన్నారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలని ఆకాం క్షించారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటా యిస్తున్నదన్నారు. ప్రజలు ఐకమత్యంగా ఉంటే గ్రామం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఆలయాల అభివృద్ధికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక నిధులను తెస్తారన్నారు. పూజా కార్యక్రమాల్లో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
శివ్వంపేట, ఫిబ్రవరి 12 : మండలంలోని ఆయా ఆలయా ల్లో ప్రముఖులు, భక్తులు పూజలు చేశారు. శివ్వంపేటలోని బగలాముఖి శక్తిపీఠం అమ్మవారిని స్కూల్ ఎడ్యుకేషనల్ కమిషనర్ దేవసేన ప్రత్యేక పూజలు చేశారు. సికింద్లాపూర్ గ్రామం లో లక్ష్మీనర్సింహస్వామికి సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో బగలాముఖి అమ్మవారి ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ, లక్ష్మీనర్సింహ ఆలయ ప్రధానపూజారి ధనుంజయశర్మ, ఈవో శశిధర్‌గుప్తా, ఆలయ సిబ్బంది నర్సింహరెడ్డి ఉన్నారు.
చిన్నశంకరంపేట, ఫిబ్రవరి 12 : మండలంలోని జంగరాయిలో దుర్గామాత ఆలయ వార్షికోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి గ్రామస్తులు ఒడిబియ్యాన్ని సమర్పించి, పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలు సమ ర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాధవి, ఎంపీపీ భాగ్యలక్ష్మి, సర్పంచ్ బందెళ్ల జ్యోతి, నాయకులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.