మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే
స్వాతంత్య్రం రాక పూర్వమే దేశంలోని మహిళలకు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన మహా మేధావి అక్షర సరస్వతి సావిత్రిబాయి పూలే అని టీఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆమె సేవలను కొనియాడారు. పట్టణంలోని ప్రధాన రహదారి విద్యుత్
- ఆమె సేవలు దేశానికే ఆదర్శం
- నారీమణులకు ఆరాధ్యురాలు
- టీఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్
- మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఘనంగా జయంతి
- విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి
సంగారెడ్డి, జనవరి 3 :స్వాతంత్య్రం రాక పూర్వమే దేశంలోని మహిళలకు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన మహా మేధావి అక్షర సరస్వతి సావిత్రిబాయి పూలే అని టీఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆమె సేవలను కొనియాడారు. పట్టణంలోని ప్రధాన రహదారి విద్యుత్ కార్యాలయం ముందు ఉన్న సావిత్రిబాయి విగ్రహానికి చింతా ప్రభాకర్ మంగళవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ సావిత్రిబాయి సేవలు నేటితరం ప్రజలకు ఉపయోగపడుతూ ఆదర్శంగా నిలిచాయన్నారు. ముఖ్యంగా మహిళలకు ఆరాధ్యురాలై చదువుల తల్లిగా గుర్తుండిపోయిందన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీల పట్టణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, నర్సింలు, చక్రపాణి, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మనోహర్‌గౌడ్, కౌన్సిలర్లు రామప్ప, విష్ణువర్ధన్, సర్పంచ్ మోహన్ సింగ్ నాయక్, నాయకులు నర్సింగ్‌రావు, జీవీ శ్రీనివాస్, జలేందర్‌రావు, అశోక్, కసిని శ్రీకాంత్, నాగరాజు, నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో…
బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం స్థానిక విద్యుత్ కార్యాలయం ఆవరణలో ఉన్న సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ నిమ్న వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేసి మహిళా విద్యాభివృద్ధికి కృషి చేసిన సామాజిక కార్యకర్త పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మాణయ్య, వెంకట హరిహర కిషన్, గంజి జానకీరామ్, కుమ్మరి సాయిలు, మల్లయ్య, మొగులయ్య, పుండరీకం, మురళి, రాఘవులు, కృష్ణ యాదవ్, శ్రీధర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో…
సావిత్రిబాయి పూలే జయంతి వేడులను ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని సావిత్రిబాయి విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ అట్టడుగు వర్గాల మహిళల హక్కుల కోసం అగ్రవర్ణాలతో పోరాడిన నాయకురాలు పూలే అని గుర్తుచేశారు. ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షుడు సజ్జాద్‌ఖాన్, కార్యదర్శి మహేశ్ కుమార్, సహాయ కార్యదర్శి శ్రీకాంత్, సాయి వరాల పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- Phule
- Savitribai Phule
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

