వసంతంలో వచ్చే తొలి పండుగ హోలీని సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరుపుకొన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. ఊరూరా కాముని దహనంతో పాటు ఉత్సాహంగా పాల్గొని ఒకరినొకరు రంగులతో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఎటుచూసినా వీధులన్నీ కలర్ఫుల్గా మారాయి. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు సందడి చేశారు.