సిద్దిపేట, అక్టోబర్ 16: సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో ఈఎన్టీ విభాగంలో వినికిడి లోపాన్ని గుర్తించే పరికరాలను సిద్దిపేట మెడికల్ కళాశాల డైరెక్టర్ విమలాథామస్, దవాఖాన సూపరింటెండెంట్ శాంతి బుధవారం ప్రారంభించారు. ఈ పరికరా లతో వినికిడి లోపాన్ని గుర్తించి సమ స్య తీవ్రత ఆధారంగా సర్జరీలు నిర్వహిస్తామని చెప్పారు.
రూ.లక్ష విలువైన సర్జరీలను ఉచితంగా ప్రభుత్వ దవాఖాన లో నిర్వహిస్తున్నామన్నారు. కా ర్యక్రమంలో ఈఎన్టీ వైద్యు లు నాగరాజు, ప్రణీత్‌కుమార్, అమిత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వరల్డ్ అనస్థీషియా డే సందర్భంగా దవాఖానలో మెడికల్ కళాశాల డైరెక్టర్ విమలాథామస్, వైద్యులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.