సిద్దిపేట, మే 22 : రామచంద్రుడు, ఆంజనేయస్వామి ఆశీస్సులతో సిద్దిపేట పట్టణం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆకాంక్షించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో హనుమాన్ మాలధారణ స్వాములు నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిద్దిపేటలో హనుమాన్ స్వాములు నిర్వహించిన శోభాయాత్ర సిద్దిపేటకే కొత్త శోభను తెచ్చిందన్నారు. ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు అందించాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
నంగునూరు, మే 22: మండలంలోని రాజగోపాల్‌పేటలో జరుగుతున్న పెద్దమ్మ ఉత్సవాల్లో హరీశ్‌రావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నర్మెటలో జరుగుతున్న కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం ఘనపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి భరోసానిచ్చారు.