నిబంధనల ప్రకారం గ్రూప్-1 ప్రిలిమినరీ నిర్వహించాలి
తెలంగాణ పబ్లి క్ సర్వీస్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. బుధవా రం కలెక్టరేట్లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై పరీక్షల అబ్జర్వర్లు, చీఫ్ సూపరింటెండెంట్ అధికారులకు శిక్షణ నిర్వహించారు.
- సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట అర్బన్, జూన్ 5 : తెలంగాణ పబ్లి క్ సర్వీస్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. బుధవా రం కలెక్టరేట్లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై పరీక్షల అబ్జర్వర్లు, చీఫ్ సూపరింటెండెంట్ అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలోని 21 కేంద్రాల్లో జరుగనుందని, ఈ పరీక్షలో 8,223 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష నిర్వహణకు ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్‌ను నియమించడం జరిగిందని, ప్రతి పరీక్షా కేంద్రంలో టీజీపీఎస్సీ నిబంధనలకు అనుగుణంగా తాగునీరు, మరుగుదొడ్డి, ఫర్నిచర్, వి ద్యుత్ తదితర సౌకర్యాలను ముందస్తుగా కల్పిం చాలన్నారు. పరీక్షకు ముందు అభ్యర్థులను పరీక్ష కేంద్రం మెయిన్ గేట్ వద్ద తనిఖీలు చేయాలని.. పరీక్ష హాల్లోకి వెళ్లేటప్పుడు మరోసారి తనిఖీ చేయాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేయాలన్నారు. అంధ దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు సహాయకులుగా ఇంటర్మీడియొట్ లేదా ఆలోపు చదివిన వారికి మాత్రమే అవకాశం కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

