మెదక్ అర్బన్ , జూలై 1: మెదక్ జిల్లా హవేళీ ఘన్పూర్లో ఎంపీడీవో,తహసీల్, వ్యవసాయ శాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సొంత భవనాలు లేక అధికారులు, సిబ్బంది, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు వివిధ పనులు నిమిత్తం కార్యాలయాలను సందర్శిస్తుంటారు.
అద్దె భవనాల్లో పార్కింగ్ సమస్య నెలకొన్నది. రికార్డుల భద్రత , గదుల వంటి మౌలిక సదుపాయాలు లేవు. వర్షాకాలంలో మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి త్వరగా ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాం డ్ చేస్తున్నారు.