చైతన్యశక్తి, స్వాతిశ్రీ జంటగా నటిస్తున్న ‘కరుణామయ’ చిత్రం బుధవారం ప్రారంభమైంది. హర్షవర్ధన్ పారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ పిక్చర్స్ పతాకంపై సంకాబత్తుల నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నామని, తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరిస్తుందని, కథలోని భావోద్వేగాలు హృదయాన్ని కదిలిస్తాయని దర్శకుడు తెలిపారు.
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఆరాధ్య హైందవి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మోనిక, దర్శకత్వం: హర్షవర్ధన్ పారెళ్ల.