నవ్వులు పంచే వినూత్న ప్రయత్నమిది
‘ఇందులో నా పాత్ర పేరు ‘దామిని’. తన ప్రయాణాన్ని ప్రేక్షకులు అద్భుతంగా ఆస్వాదిస్తారు. తిరువీర్ కార్పొరేటర్ కావాలని కలలుకనే యువకుడిగా కనిపిస్తాడు. వాళ్ల నాన్న.. తన కొడుకులిద్దరిలో ఎవరికి ముందు కొడుకు పుడితే వాడికే ఆస్తి రాస్తానంటాడు.
‘ఇందులో నా పాత్ర పేరు ‘దామిని’. తన ప్రయాణాన్ని ప్రేక్షకులు అద్భుతంగా ఆస్వాదిస్తారు. తిరువీర్ కార్పొరేటర్ కావాలని కలలుకనే యువకుడిగా కనిపిస్తాడు. వాళ్ల నాన్న.. తన కొడుకులిద్దరిలో ఎవరికి ముందు కొడుకు పుడితే వాడికే ఆస్తి రాస్తానంటాడు. అలాంటి సమయంలో తిరువీర్ జీవితంలోకి నేను ఎంట్రీ ఇస్తాను. నేనేమో ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయిని. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఈ కథలో ఆసక్తికరమైన అంశం’ అంటూ చెప్పుకొచ్చింది అగ్ర కథానాయిక ఐశ్వర్య రాజేశ్. ఆమె, తిరువీర్ జంటగా నటించిన రూరల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకుడు. మహేశ్వర్రెడ్డి మూలి నిర్మాత. శుక్రవారం(నేడు) సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో కథానాయిక ఐశ్వర్యరాజేష్ విలేకరులతో మాట్లాడింది. ‘దర్శకుడు భరత్ దర్శన్ ఈ కథ చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. నేను ఇప్పటివరకూ పనిచేసింది ఎక్కువ శాతం కొత్తవారితోనే. భరత్ కూడా కచ్చితంగా సక్సెస్ అవుతాడు. తిరువీర్ ఇందులో సహజంగా నటించారు. నిర్మాత మహేశ్వరరెడ్డి అభిరుచి గల నిర్మాత. ఇది ఒక క్యూట్ విలేజ్ స్టోరీ. చక్కటి వినోదం ఉంటుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని నమ్మకం వెలిబుచ్చింది ఐశ్వర్య రాజేష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

