గజ్వేల్, ఏప్రిల్ 12: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఈ సంవతర్సం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలే పై చేయిగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంటర్ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఈ యేడు టాప్‌స్కోర్ చేయడంలో ముందుండగా ఫలితాల శాతంలో వెనుకబడి ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాల, బాలికలు 64.39 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 8,876 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 5,716మంది ఉత్తీర్ణత పొందారు.
అందులో 6,685 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 4,266 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో 2,191 మంది పరీక్షలకు హాజరుకాగా 1,450మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలే ఫలితాల్లో పై చేయిగా నిలిచారు.ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా బాల, బాలికలు 54.97 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో 9,946 మంది బాల, బాలికలు పరీక్షలకు హాజరుకాగా అందులో 5,567 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
బాలుర విభాగంలో 7,387మంది హాజరుకాగా 3,967మంది, బాలికల విభాగంలో 2,559 మంది హాజరుకాగా 1,500 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం ఫలితాలు గతేడాదితో చూస్తే కొద్దిగా మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఈ యేడు ఫలితాలు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 64.39 శాతం రాగా గతేడాది 59.60శాతం ఫలితాలు వచ్చాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఈ యేడు 54.97ఫలితాలు రాగా గతేడాది 51.50 శాతం ఫలితాలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు.
1. ఈ.ప్రదీప్‌కుమార్ (సీఈసీ) 490/500, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోహెడ
2. డి.సుకేశ్వర్ (ఈటీ)495/500, ప్రభుత్వ జూనియర్ కళాశాల, దుబ్బాక
3. ఆర్.అర్చన(ఎంఎల్టీ) 484/500, ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలుర), సిద్దిపేట
4. ఆర్.చరణ్(ఎంపీసీ) 459/470, ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలుర), గజ్వేల్
5. అనూశ్రీ(ఎంపీసీ) 449/470, ప్రభుత్వ జూనియర్ కళాశాల, దౌల్తాబాద్
1. ఎం. హారిక(ఎంపీసీ) 994/1000, ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలికల), సిద్దిపేట
2. ఎం.ప్రశాంత్(ఎంపీసీ) 983/1000, ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలుర), సిద్దిపేట
3. కె.బాలలక్ష్మి(బైపీసీ) 977/1000, ప్రభుత్వ జూనియర్ కళాశాల, చేర్యాల
4. ఎ.మనీష(సీఈసీ) 955/1000, ప్రభుత్వ జూనియర్ కళాశాల, దుబ్బాక
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 12 : ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు ఆదివారం విడుదల చేసింది. మెదక్ జిల్లాలో ఈసారి కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో జనరల్ విభాగం ప్రథమ సంవత్సరంలో 55.27 శాతం ఉతీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 68. 59 శాతం సాధించారు. రాష్ట్రంలో మెదక్ జిల్లా ప్రథమ సంవత్సరంలో 28వ స్థానం లో నిలువగా, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 25 ప్రారంభమైన పరీక్షలు మార్చి రెండో వా రంలో ముగిశాయి. మెదక్ జిల్లాలో 30 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. జనరల్ విభాగంలో మొత్తం 10,536 మంది విద్యార్థులకు 6,466 మంది ఉతీర్ణులయ్యారు. ఇందులో ప్రథమ సంవత్సరంలో 5,710 మంది విద్యార్థులకు కేవలం 3,156 మంది మాత్రమే(55.27 శాతం ) ఉతీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 4,826 మంది విద్యార్థులకు 3,310 మంది మాత్రమే ఉతీర్ణత(68.59శాతం) సాధించారు.
ఒకేషనల్ కోర్సు ప్రథమ సంవత్సరంలో మెదక్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలువగా, ద్వితీయ సంవత్సరంలో రాష్ట్రంలో తృతీయ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో 599 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్ష రాయగా, 440 మంది (73.46 శాతం) ఉతీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 539 మందికి 460 మంది విద్యార్థులు(85.34 శాతం) ఉతీర్ణులయ్యారు.
ఇంటర్ ఫలితాలల్లో ఈసారి సైతం జిల్లాలో బాలికల హవా కొనసాగింది. ప్రథమ సంవత్సరంలో 2,460 మంది బాలురు పరీక్షలు రాయగా, 1,156 మంది మాత్రమే ఉతీర్ణత (46.99శాతం)సాధించారు. బాలికలు 3,250 మంది పరీక్షలు రాయగా, 2,000 మంది ఉతీర్ణత(61.54 శాతం) సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 1,983 మంది బాలురు పరీక్షలు రాయగా, 1,168 మంది ఉతీర్ణత(58.90 శాతం) సాధించారు. బాలికలు 2,843 మంది రాయగా, 2,142 మంది ఉతీర్ణత(75.34 శాతం) సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం ఉతీర్ణత సాధించడం విశేషం.
మే 13 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగనున్నాయని మెదక్ జిల్లా ఇంటర్ నోడల్ అధికారి మాధవి తెలిపారు.రీకౌంటింగ్, రివెరిఫికేషన్‌కు మే 20వ తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగిందన్నారు. రీ వెరిఫికేషన్‌కు రూ. 600, రీ కౌంటింగ్‌కు రూ. 100 ఫీజు చెల్లించాలన్నారు.