జగదేవ్‌పూర్ జూన్ 30 : అర్హులైన వారందరికీ సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందించి ఇండ్లు నిర్మించుకునేందుకు చేయూతనందిస్తారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరుప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఎస్సీఫంక్షన్హాల్లో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 76 ఎస్సీ కుటుంబాలకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ దళితుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి పని చేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా దళిత బంధు పథకం చేపట్టి పది లక్షల ఆర్థిక సాయంతో నిరుపేద దళిత కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. తిమ్మపూర్‌లో ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ ఏండ్ల నుంచి కలగా వస్తుందన్నారు. కానీ మంత్రి హరీశ్‌రావు సహకారంతో నేడు 76 మంది నిరుపేద కుటుంబాలకు ఇండ్ల పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఆర్డీవో విజయందర్రెడ్డి, ఎంపీపీ బాలేశంగౌడ్, జెడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ రంగారెడ్డి, సర్పంచ్ల జగదేవ్‌పూర్, తిమ్మాపూర్ సర్పంచ్‌లు లక్ష్మీరమేశ్, లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి, ఫోరం మండలాధ్యక్షుడు నరేశ్, ఎంపీటీసీలు కిరణ్ కవితా శ్రీనివాస్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎక్బాల్, నాయకులు పాల్గొన్నారు.
ములుగు, జూన్ 30 : ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూ ములిచ్చిన భూ నిర్వాసితుల త్యాగం మరువలేనిదని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. ములుగు మండలపరిధిలోని భైలంపూర్, మామిడ్యాల్, తానేదార్పల్లి, తానేదార్పల్లి తండా గ్రామాలకు చెందిన కొండపోచమ్మ భూ నిర్వాసితులకు శుక్రవారం మండలకేంద్రం ములుగులో ఇండ్ల పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ జహంగీర్, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం ఉపాధ్యక్షుడు జుబేర్‌పాషా, బీఆర్ఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి అర్జున్‌గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దుంబాల లింగారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయ డు ఐలయ్య, భూనిర్వాసితులు ఉన్నారు.