విపణి అదుర్స్
నిత్యం పుస్తకాలతో బిజీబిజీగా ఉండే విద్యార్థినులు సరదాగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వారికి వచ్చిన వంటలు చేయడంతోపాటు వివిధ హస్తకళలను ప్రదర్శించారు.
- ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినుల స్టాళ్ల ప్రదర్శన
- ప్రారంభించిన సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 17: నిత్యం పుస్తకాలతో బిజీబిజీగా ఉండే విద్యార్థినులు సరదాగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వారికి వచ్చిన వంటలు చేయడంతోపాటు వివిధ హస్తకళలను ప్రదర్శించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే విపణి (సంత) కార్యక్రమాన్ని శనివారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా ముఖ్యఅతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తయారు చేసిన వివిధ హస్తకళలను తిలకించి వారిని అభినందించారు. వారు తయారు చేసిన ఆయా ఆహార పదార్థాలను రుచి చూసిన అదనపు కలెక్టర్ విద్యార్థినుల నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు చదువులతోపాటు తమ ఉన్న నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాలలో నిర్వహించిన విపణి కార్యక్రమం చాలా బాగున్నదని కితాబిచ్చారు.
ఆకట్టుకున్న స్టాళ్లు
కళాశాలలో ఏర్పాటు చేసిన విపణిలో భాగంగా విద్యార్థినుల స్టాళ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. జొన్న రొట్టెలు, పోలెలు, బిర్యానీ, మిరపకాయ బజ్జీలు, పానీ పూరి, సున్నుండలు, బెల్లం పట్టీలు వంటి అనేక ఆహార పదార్థాలతో పాటు జ్యూట్ బ్యాగులు వంటి హస్తకళలను విద్యార్థినులు ప్రదర్శించారు. విద్యార్థులు నిర్వహించిన ఆయా ఆటల పోటీల్లో పాల్గొని సందడి చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల కృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ హ్యూమేరా సయీద్, అధ్యాపకులు, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, పరిసర ప్రాంతాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

