అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ అందాలి
అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ అందాలని మెదక్ జి ల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. పంటరుణమాఫీ సమస్యలను నివృత్తి చేసుకోవడానికి ప్రతి మండల కేంద్రంలో బ్యాంకుల వద్ద వ్యవసాయాధికారులతో గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.
- మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ అందాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. పంటరుణమాఫీ సమస్యలను నివృత్తి చేసుకోవడానికి ప్రతి మండల కేంద్రంలో బ్యాంకుల వద్ద వ్యవసాయాధికారులతో గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం సంబంధిత లీడ్ బ్యాంక్ మేనేజర్‌తో కలిసి మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం బూర్గుపల్లి ఎస్బీఐ బ్రాంచ్ వద్ద పంటరుణమాఫీ పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూర్గుపల్లి ఎస్బీఐ లో 391 అకౌంట్లు ఉన్నాయని, ఇప్పటివరకు 367 మంది రైతులకు పంటరుణమాఫీ వర్తించిందన్నారు.
పంటరుణ మాఫీపై క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడత లక్షలోపు ఉన్న 47,978 మంది రైతులకు వివిధ బ్యాంకుల ద్వారా రూ.23 8.81 కోట్లు విడుదల చేయగా అందులో47,616 మంది రైతుల ఖాతాల్లో 237.5 కోట్లు జమచేసినట్లు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల 362 మంది రైతులకు సంబంధించి రూ.1.3 కోట్లు జమకావాల్సి ఉందన్నారు. సంబంధిత రైతులకు పంట రుణమాఫీ సొమ్ము చేరేలా బ్యాంకు అధికారులు వ్యవసాయాధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటరుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని బ్యాంకు మేనేజర్లు, వ్యవసాయాధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ నరసింహమూర్తి, బూర్గుపల్లి ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ శ్రీధర్, వ్యవసాయాధికారులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

