గజ్వేల్ : ఈ నెల 27న వరంగల్ ( Warangal ) లోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ప్రతి కార్యకర్త ఉద్యమ స్ఫూర్తితో కదం తొక్కాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి (MLC Yadava Reddy) , నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి (Vanteru Pratap Reddy0 పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్ష మంది తరలించే లక్ష్యం కాగా గజ్వేల్ నియోజకవర్గంలో గ్రామానికి వంద మంది చొప్పున 15వేల మందిని 280 ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
హరీశ్‌రావు ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొవడంతో పాటు తొమ్మిది మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో కార్యాకర్తల సమావేశాలు నిర్వహించుకొని దిశానిర్ధేశం చేశామన్నారు. ప్రతి గ్రామం నుంచి బయలుదేరే బస్సు సభ ప్రాంగణానికి రెండు గంటల ముందే చేరుకునేలా ఏర్పాట్లు చేసుకొవాలని సూచించారు. కేసీఆర్ ప్రసంగం విన్న తరువాతనే అక్కడి నుంచి తిరిగి వచ్చేలా గ్రామాల్లోని ముఖ్య కార్యకర్తలు చూసుకొవాలన్నారు.
16 నెలల ప్రభుత్వ పాలనపై వ్యతిరేకతతో ప్రజలు బీఆర్ఎస్ సభకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నరని తెలిపారు. ప్రజలు మోసపోయి అధికారమిస్తే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 13హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలు సంతృప్తిగా లేరని, గడిచిన 16నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభియోగాలను తిప్పికొట్టడంలో సఫలమయ్యామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతోనే సరిపెడుతుందని తప్పా చేతల్లో మాత్రం చేసింది శూన్యమన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అంటూ తిరిగి కేసీఆర్ పాలనను కొరుకుంటున్నరన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ జేజాల వెంకటేశంగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, బొల్లారం ఎల్లయ్య, దయాకర్‌రెడ్డి, రజిత, రమేష్‌గౌడ్, హైదర్‌పటేల్, దేవేందర్, నాగిరెడ్డి, చందు, కనకయ్య, మన్నె వెంకటేష్, అశోక్, మధుసూదన్‌రెడ్డి, శివకుమార్, మోహన్‌బాబు, కరీం, మురళి తదితరులు పాల్గొన్నారు.