జహీరాబాద్ నియోజకవర్గంలో 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ డ్రైవింగ్ లైసెన్స్ అందిస్తామని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు తెలిపారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో యువతీయువకులకు ఆయన లైసెన్స్ పత్రాలు అందజేశారు. రోజువారీగా దరఖాస్తు చేసుకున్న వారికి ల్రైసెన్స్ పత్రాలు అందజేస్తామన్నారు.
జహీరాబాద్, జూలై 25: నియోజకవర్గంలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ డ్రైవింగ్ లైసెన్స్ అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో యువతీయువకులకు డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఉచిత లైసెన్స్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లైసెన్స్‌ల మేళాలో దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత లెర్నింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్(ఎల్ఎల్ఆర్) కాపీలను అందజేశారు. 150 మందికి లెర్నర్స్ లైసెన్స్ పత్రాలు అందజేశారు. రోజువారీగా దరఖాస్తు చేసుకున్న వారికి డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలు అందజేస్తామన్నారు. వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, వాహనదారులందరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ అందిస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.