
తూప్రాన్/రామాయంపేట, డిసెంబర్ 13: గుజరాత్లో ఈ నెల 15 నుంచి 18 వరకు 34 వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాప్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో జిల్లా నుంచి ఇద్దరు బాలురు, ఒక బాలిక ఎంపికైనట్లు జిల్లా సాప్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ తెలిపారు. గత నెల జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికైనట్లు తెలిపారు. బాలుర జట్టుకు నర్సాపూర్ గిరిజన సంక్షేమ సాప్ట్‌బాల్ అకాడమీ నుంచి మహిపాల్, సం జీవ్ , సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ములుగు నుంచి పూజ ఎంపికయ్యారన్నారు. ఈసందర్భంగా విద్యార్థులను అభినందించారు.
శివ్వంపేట మండలంలో ఆదివారం జరిగిన నేషనల్ లెవల్ కరాటే పోటీల్లో తూప్రాన్ గీతా స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఇందులో భాగం గా అండర్ 12 విభాగంలో సహస్ర గోల్డ్‌మెడల్ సాధించగా, ప్రనోజ్ఞ సిల్వర్ మెడల్‌ను సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామాంజనేయులు, చైర్ పర్సన్ ఉష, డైరెక్టర్ , మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్‌గౌడ్ సోమవారం విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్ నా రాయణ , ప్రిన్సిపాల్ వెంకటకృష్ణారావు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాజేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జాతీయ కరాటే పోటీలో విద్యార్థుల ప్రతిభ
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో ఆ దివారం పోలీస్ బెటాలియన్ అన్నపూర్ణ డైనింగ్ హాల్ షోటోకాన్ కరా టే క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ జాతీయ స్థాయి కరాటే పోటీలో మెదక్ విద్యార్థులు ప్రతిభ కనబరచారని కరాటే మాస్టర్ దినకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మాయిల విభాగంలో లతిక, శ్లోక, ఐశ్వర్య, విశిష్టరాజ్లకు బంగారం పతకం సాధించగా, వైష్ణవి, అఖిల గౌడ్, మధుప్రియ, హరిణి, హహన్య, హెల్వెన్ సిల్వర్ పతకం సాధించగా, సనవి, అక్షరలు బ్రౌన్ పతకం సాధించారు. బాలుర విభాగంలో ప్రణయ్, సూరజ్, వంశీ , విగ్నేశ్, సుహాన్ లకు బంగారు పతకం సాధించగా, విమల్ నాగ్ సాత్విక్గౌడ్, మణిదీప్, కెన్ని, రబ్బు, అభినవ్, రీతిశ్ , శ్రీశాంత్, జస్వంత్, కనుష్కచారి, భరత్, కెవెన్, రెహన్ బ్రౌన్ పతకం సాధించినట్లు తెలిపారు. ఈ పతకాలను హీరో సుమన్ అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో వివి ధ రాష్ర్టాల నుంచి సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు.