పాపన్నపేట, మే 22: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయలకు చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏడుపాయల ఆలయ ఈవో శ్రీనివాస్, సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, రవికుమార్, నరేశ్, మహేశ్ తదితరులు ఏర్పాటు చేశారు. వేద పండితులు శంకర్‌శర్మ, పార్థివ శర్మ, రాజశేఖర్‌శర్మ, రాము శర్మ తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పాపన్నపేట ఎస్ఐ విజయ్‌కుమార్ తగిన బందోబస్తు చేపట్టారు.