చలికాలం.. జీవాలు పదిలం!
రోజురోజుకూ చలి తీవ్రత పెరిగిపోతుంది. దీంతో జీవాల్లో పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. జీవాలకు తమ్ములు, కండ్లు, ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు వీటికి కరణమవుతాయి.
- మేకలు, గొర్రెలకు వ్యాధులు సోకే అవకాశం
- అప్రమత్తంగా ఉండాలంటున్న పశువైద్యులు
న్యాల్కల్, డిసెంబర్ 14: రోజురోజుకూ చలి తీవ్రత పెరిగిపోతుంది. దీంతో జీవాల్లో పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. జీవాలకు తమ్ములు, కండ్లు, ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు వీటికి కరణమవుతాయి. క్రిములతో సోకే అంటువ్యాధులతోపాటు అరుబయట గడ్డి తినడంతో శ్వాసకోశంలోకి వచ్చే కణాలతో వ్యాధులు వస్తాయి. వ్యాధుల నివారణకు గాలి,వెలుతురు సరిగ్గా వచ్చే విధంగా చూడాలి. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు జీవాలకు బయటకు వదలకూడదు. పాకలను శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాధులు సోకినప్పుడు పశువైద్యాధికారులను సంప్రదించాలి.
ముఖ్యంగా చలికాలంలో మేకలు, గొర్రెల్లో పీపీఆర్ (పుర్రు) వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధి వల్ల ఆరోగ్యమైన జీవాలకు జబ్బు చేసిన జీవాలు దగ్గినప్పుడు వెలువడే తుంపరలో కూడా వ్యాధి కారక వైరస్ ఉంటుంది. వ్యాధి సోకిన జీవాలు పారిన పెండ, ముక్కు, కండ్ల నుంచి వచ్చే ద్రవాలతో వ్యాధి వ్యాప్తించెందే అవకాశం ఉంటుంది. అలాగే జీవాలకు తీవ్రమైన జ్వరం ఉంటుంది. ముక్కు నుంచి నీళ్లు కారడం ప్రారంభమై, ఒకటి, రెండు రోజుల్లో చిమిడి రూపంలోకి మారుతుంది. కండ్లు ఎర్రబడి నీరు కారుతుంది. నోటిలోపలి పొర దెబ్బతిని, చిగుళ్లు పొర సెక్రోసిస్ చెందవచ్చు. ఉపిరితిత్తులకు వ్యాధి సోకడం వల్ల దగ్గు వస్తుంది. దీంతో జీవాలు నీళ్ల పారడం వల్ల 3 నుంచి 4 రోజుల్లోనే చనిపోయే అవకాశం ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పెంపకందారులు జాగ్రత్తలు తీసుకోవాలి
జీవాలు చలి బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవాల విషయంలో పెంపకందారులు ఎక్కవగా శ్రద్ధ వహించాలి. పీపీఆర్(పుర్రు) వైరస్ జీవాలకు సోకే అవకాశం ఉంటుంది. దీని నివారణకు నిర్ధిష్టమైన చికిత్స లేదు. రోగాలు రాకుండా దీర్ఘకాలంపాటు పనిచేసే అక్రీటెట్రాసైక్లిన్ వాడవచ్చు.
నీరసించిన జీవాలకు గ్లూకోజ్ ఎక్కించవచ్చు. ఈ వ్యాధి టీకా మందును పశుసంవర్ధక శాఖ ఉచితంగా జీవాలకు అందజేస్తుంది. ఆరోగ్యంగా ఉన్న జీవాలకు చర్మం కింద టీకా ఇస్తారు. పెంపకందారులు జీవాలు నివసించే పాకలను శుభ్రంగా ఉంచుకోవాలి. గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

