సైబర్ నేరాలకు నియంత్రించాలి
సైబర్ నేరాలు జరగకుండా సైబర్ వారియర్స్ కీలక పాత్ర పోషించాలని, సైబర్ నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో సైబర్ వారియర్స్‌కు సైబర్ నేరాలు, నియంత్రరణపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు.
- సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ
సిద్దిపేట అర్బన్, మార్చి 1: సైబర్ నేరాలు జరగకుండా సైబర్ వారియర్స్ కీలక పాత్ర పోషించాలని, సైబర్ నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో సైబర్ వారియర్స్‌కు సైబర్ నేరాలు, నియంత్రరణపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సైబర్ నేరాల నియంత్రణ, అమౌంట్ ఫ్రీజ్, బాధితులకు నగదు అప్పగించడంలో సిద్దిపేట కమిషనరేట్ మొదటిస్థానంలో నిలిచినందుకు సైబర్ వారియర్స్‌ను అభినందించారు.
సైబర్ నేరం జరిగి ఫ్రీజ్ అయిన నగదును సంబంధింత బాధితులకు అందేలా బ్యాంకు అధికారులతో కీలకంగా వ్యవహరించాలన్నారు. సైబర్ క్రైమ్‌తో ఆర్థికంగా నష్టపోయిన బాధితులు ముందుగా నేషన్ సైబర్ క్రైం విభాగం హెల్ప్ లైన్ నెంబర్ 1930కు సమాచారం అందజేయాలని సూచించారు. బాధితులకు సత్వరమే అందించే న్యాయంపై స్టేషన్ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో సైబర్ సెల్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ శేఖర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి, శ్రీధర్, ఎస్బీ ఎస్ఐ నరేందర్‌రెడ్డి, సైబర్స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

