పైసలు చల్లు.. పదవి పట్టు..!
మెజార్టీ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ డబ్బులు ఎరవేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఓ గ్రామంలో రూ.కోటి వర కు ఖర్చు చేసేందుకు అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు ముందుకు వచ్చాడు. కు లాలు, సంఘాలు, పార్టీలతో శనివారం ఆయన సమావేశం నిర్వహించి కోటి రూపాయలు ఇస్తానని, తనను సర్పంచ్ పదవికి ఏకగ్రీవం చేయాలని డిమాండ్ పెట్టాడు.
- సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో సర్పంచ్ పదవులు దక్కించుకునేందుకు అధికార పార్టీ విశ్వప్రయత్నాలు
- ఒక గ్రామంలో రూ.కోటి వరకు ఖర్చుకు కాంగ్రెస్ నేత రెడీ
- మరో గ్రామంలో రూ.20లక్షలతో గుడి, సీసీ రోడ్లు వేస్తానంటున్న కాంగ్రెస్ నాయకుడు
చేర్యాల, నవంబర్ 29 : మెజార్టీ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ డబ్బులు ఎరవేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఓ గ్రామంలో రూ.కోటి వర కు ఖర్చు చేసేందుకు అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు ముందుకు వచ్చాడు. కు లాలు, సంఘాలు, పార్టీలతో శనివారం ఆయన సమావేశం నిర్వహించి కోటి రూపాయలు ఇస్తానని, తనను సర్పంచ్ పదవికి ఏకగ్రీవం చేయాలని డిమాండ్ పెట్టాడు.
అంతేకాకుండా సొంత డబ్బులతో గ్రామంలో సీసీ రోడ్లు పోయిస్తానని, నూతనంగా ఆలయాలు నిర్మించడంతో పాటు మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చాడు.అదే సమయంలో మరో అధికార పార్టీకి చెందిన వ్యక్తి తాను రూ.51 లక్షల ఇస్తానని అనడంతో అక్కడ గందరగోళం ఏర్పడి మరో రోజు వాయిదా పడింది. ఇక మండలానికి దూరంగా ఉండే ఓ గ్రామం లో బీఆర్ఎస్కు చెందిన వ్యక్తి గత ఎన్నికల్లో ఓడిపోయాడు. ఈసారి గ్రామంలోని అన్నివర్గాల ప్రజలు అతనికే మద్దతు ఇస్తుండడంతో, దానిని అడ్డుకునేందుకు అధికార పార్టీ నాయకులు మరో ఎత్తువేశారు.
గ్రామంలో ఆలయాల వద్ద రాళ్లు తదతర వాటిని తొలిగించాలని, అందుకు రూ.20లక్షల మేరకు ఖర్చు అవుతుందని, అవి ఇస్తే ఓకేనని, లేదంటే తాము అభ్యర్థిని నిలబెడుతామని అడ్డుపుల్ల వేశారు.ఇక మరో గ్రామం లో రూ.15లక్షలతో సీసీ రోడ్లు పోయిస్తానని, ఆలయానికి వెళ్లే రోడ్డు బాగు చేస్తానని అధికార పార్టీ నాయకుడు హామీ ఇవ్వడమే కాకుండా పనులు చేసేందుకు ఇసుక, గ్రానైట్ రాయి సైతం ఓ చోట వేయించినట్లు తెలిసిం ది. డబ్బులు వెదజల్లి సర్పంచ్ పదవులు ఏకగ్రీవం చేసుకోవాలని అధికార పార్టీ నేత లు ఎత్తులు వేస్తున్నారు. దీనిపై అధికార యం త్రాంగం చర్యలు తీసుకోకపోవడం విశేషం.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

