కమనీయం.. గోదా రంగనాథస్వామి కల్యాణం
పట్టణంలోని ప్రాచీన భూనీల సమేత రంగనాథస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన గోదారంగనాథస్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉదయం దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నిర్వాహకులు పట్టు వస్ర్తాలతో కల్యాణానికి సిద్ధం చేశారు.
- హాజరైన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజర్సింహ
అందోల్, జనవరి 28 : పట్టణంలోని ప్రాచీన భూనీల సమేత రంగనాథస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన గోదారంగనాథస్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉదయం దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నిర్వాహకులు పట్టు వస్ర్తాలతో కల్యాణానికి సిద్ధం చేశారు. వేడుకలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కల్యాణంలో పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆలయ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని తెలిపారు. రంగనాథస్వామి జాతర రథం కోసం అవసరమైన ఆర్థిక సాయం అందజేస్తానన్నారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భిక్షపతి సైతం కల్యాణోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సురేందర్‌గౌడ్, చిట్టిబాబు, హరికృష్ణగౌడ్, చెందర్నాయక్, దుర్గేశ్, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, నాయకులు ప్రదీప్‌గౌడ్, సారశివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

