పంట రుణమాఫీ డబ్బులు జమచేయాలి
పంట రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని, రెన్యువల్ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి బ్యాంకు అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రంలోని ఎస్బీఐని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. రూ.లక్షలోపు ఎంత మంది రైతులకు రుణమాఫీ వర్తించిందని ప్రశ్నించగా 660 మందికి వచ్చిందని బ్యాంక్ మేనేజర్ జాదవ్ సంతోష్ తెలిపారు.
- సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
కల్హేర్, జూలై 24: పంట రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని, రెన్యువల్ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి బ్యాంకు అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రంలోని ఎస్బీఐని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. రూ.లక్షలోపు ఎంత మంది రైతులకు రుణమాఫీ వర్తించిందని ప్రశ్నించగా 660 మందికి వచ్చిందని బ్యాంక్ మేనేజర్ జాదవ్ సంతోష్ తెలిపారు. ఇప్పటి వరకు 120 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. కోటి రూపాయాలు జమచేయడం జరిగిందని, మిగిలిన 440 మంది రైతుల పంటరుణాలను వారి ఖాతాల్లో జమచేస్తామన్నా రు. గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసిన పంటరుణమాఫీపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలని ఆమె ఆదేశించారు.
ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భం గా మూడు, నాలుగో తరగతి విద్యార్థులతో గుణింతాలు చదివించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో బాలింతలు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నా రు. ఉన్నత పాఠశాలలో డిజిటల్ టీవీలను ఎందుకు వినియోగించడం లేదని ఉపాధ్యాయులను ప్రశ్నించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

