సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 26: జిల్లాలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ పశువైద్య సిబ్బంది వచ్చి పశుగణన సమాచారాన్ని సేకరిస్తారని, వారికి సహకరించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి కోరారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పశుగణన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి ఆమె ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు పశుగణన కొనసాగుతుందన్నారు.
ఐదేండ్లకు ఒకసారి జరిగే పశుగణనలో భాగంగా జిల్లాలో 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమాన్ని ప్రా రంభించామన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామం లో 16 రకాల జంతు జాతులు, కోళ్లను లెక్కిస్తామని, పశు గణన ద్వారా పాలు, గుడ్లు, మాంస ఉత్పత్తితోపాటు ఉన్ని ఉత్పత్తి విషయాలు తెలుస్తాయన్నారు. సగటు వినియో గం, ఎగుమతులు, దిగుమతులు, పశువులకు కావాల్సిన టీకాలు, మందుల సరఫరా పశుగణన ద్వారా నిర్ధారించవచ్చని తెలిపా రు.
జిల్లాలో పశు గణన కోసం 131 మంది ఎన్యూమరేటర్లు, 33 మంది సూపర్ వైజర్లను నియమించామన్నారు. నిర్ణీత గడువు లో సర్వే పక్కాగా పూర్తి చేయాలని సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వసంతకుమారి, సహాయ సంచాలకులు రవీంద్రప్రసాద్, రాజేశ్వర్, ప్రభాకర్, పవన్‌కుమార్, వ్యాస్, శ్రీరాం చరణ్‌దాస్, అనూష పాల్గొన్నారు.