ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
ప్రభుత్వ పా ఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు దోహ దం చేసేలా విద్యా బోధన చేస్తున్నామని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఆదివారం మెదక్ కలెక్టరేట్ నుంచి ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
- మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపు
మెదక్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పా ఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు దోహ దం చేసేలా విద్యా బోధన చేస్తున్నామని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఆదివారం మెదక్ కలెక్టరేట్ నుంచి ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మెదక్ జిల్లాలో సోమవారం ప్రభుత్వ పాఠశాలలు 928, ప్రైవేట్ పాఠశాలలు 109 ప్రారంభమవుతాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పున: ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. బడిబాటలో 1,26,000 మంది విద్యార్థులను గుర్తించామని తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించామని, తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. విద్యార్థులు తరగతి గదిలోకి కొత్త ఉత్సాహంతో అడుగు పెట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. క్రమ శిక్షణతో చదువుకొని ఉజ్వల భవిష్యత్ సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, పరిసరాల శుభ్రంగా ఉంచాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. బడి బాట కార్యక్రమంలో మొదటి రోజు విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అం దించాలన్నారు. విద్యార్థుల హాజరు శాతం పెం పుతో పాటు డిజిటల్ విద్యా బోధనకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొ న్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

