జహీరాబాద్, ఏప్రిల్ 5: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని చిరాగ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దు చెక్‌పోస్టు వద్ద 10.30 గ్రాముల కొకైన్ డ్రగ్స్‌ను జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది. శనివారం జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ అదేశాల మేరకు స్థాని క చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.
ముంబై నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని అనుమానంతో సోదా చేయగా 10.30 గ్రాముల కోకైన్ డ్రగ్స్ లభించింది. వెంటనే అదుపులోకి తీసుకుని ఆయన నుంచి కొకైన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఏపీలోని కృష్ణా జిల్లా బందుపల్లి మండలం జానకీరాంపూర్కు చెందిన చంద్రశేఖర్‌గా గుర్తించారు. అతన్నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శంకర్ తెలిపారు. తనిఖీల్లో అధికారులు కోటేశ్వర్రావు, హనుమంతు, సిబ్బంది పాల్గొన్నారు.