మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 12: క్రిస్మస్ పండుగ సమీపిస్తుండటంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి ఆవరణ సందడిగా మారింది. సీఎస్ఐ వసతి గృహాల వద్ద ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలిపే పశువుల పాక, బెత్లే హోం, నజరేతు పట్టణం, జెరూసలేం చర్చి నమూనాలను విద్యార్థులు ఎంతో సుందరంగా రూపొందించారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్కు నెల రోజుల ముందే ఈ నమూనాలను సిద్ధం చేస్తారు.