బంగారు భవిష్యత్తుకు విద్యార్థి దశ కీలకమని, చిన్నప్పటి నుంచి లక్ష్యాలను నిర్దేశించుకొని పెట్టుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని శాంతినగర్ సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను బుధవారం ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సైన్స్ ప్రదర్శనలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థుల టాలెంట్‌ను గుర్తించి వారికి బంగారు బాటలు వేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 7: విద్యార్థి దశ నుంచే ఎదగాల ని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం స్థానిక శాంతినగర్‌లోని సేయింట్ ఆంథోనీస్ పాఠశాలలో జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే ప్రస్తుత స్థాయి తొలిమెట్టని పేర్కొన్నారు. ఈ స్థాయిలో తమలోని నైపుణ్యాన్ని బయటకు వెలికితీసేందుకు సైన్స్ ప్రదర్శనలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థుల్లో దాగిఉన్న కలను గుర్తించి వారి అభ్యున్నతికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
ఉపాధ్యాయులే విద్యార్థులకు తల్లిదండ్రుల్లాంటి వారని, అంతే బాధ్యతతో పని చేయాలన్నారు. తమ ప్రదర్శనను తిలకించేందుకు ఎంతటి పెద్ద హోదా వ్యక్తులు వచ్చినా నిర్భయంగా ప్రదర్శనను వివరించాలని విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం నింపారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గురుకుల పాఠశాలలను మన ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన ఏర్పాటుకు సహకరించిన వారికి ఆయన అభినందనలు తెలిపారు.
ఇదిలాఉండగా ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్‌తో పాటు జవహార్‌లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్ (జేఎన్ఎన్ఎస్ఎమ్ఈఈ)ను నిర్వహిస్తున్నామని డీఈవో రాజేశ్ వివరించారు. ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్‌కు సంబంధించి 81 ప్రాజెక్టులు హాజరు కాగా, జేఎన్ఎన్ఎస్ఎంఈఈకు సంబంధించి 394 ప్రాజెక్టులు హాజరైనట్లు తెలిపారు. ఈ నెల 8న న్యాయనిర్ణేతలు రాష్ట్రస్థాయికి ప్రాజెక్టులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. అనంతరం చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ విద్యార్థుల ప్రదర్శనలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఆయా ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ అలరించాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్పర్సన్ లతా విజయేందర్‌రెడ్డి, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్, నోడల్ అధికారి లింబాజీ, ఏడీ విజయ, జిల్లా సైన్స్ అధికారి విజయ్‌కుమార్, సైన్స్‌ఫెయిర్ కన్వీనర్‌గా జాకీర్ హుస్సేన్, పాఠశాల ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.