ఝరాసంగం, మే 29: లోక కల్యాణార్ధం ద్విశత చండీ మహాయాగం మూడు రోజులుగా నిర్వహిస్తున్నామని వేదపండితుడు గణేశ్ దీక్షిత్ తెలిపారు. ఝరాసంగం వాసవి కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఈ యాగానికి ఆదివారం కర్ణాటక స్పీకర్ రఘునాథ్‌రావు మల్కాపూరే, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో పాల్గొన్న తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి, ఆశ్రమ పీఠాధిపతి వైరాఘ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్ మాట్లాడుతూ లోక కల్యాణార్ధం చేసే యాగాలతో వర్షాలు సమృద్ధిగా కురవడం, పంటలు బాగా పండి ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్, ఎంపీటీసీ విజయేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మఠం రాచయ్యస్వామి, నాయకులు సంగమేశ్వర్, కేతకీ ఆలయ మాజీ చైర్మన్ వెంకటేశ్‌గుప్తా, భక్తులు పాల్గొన్నారు.