గుమ్మడిదల, మార్చి 5 : ప్యారానగర్ డంపింగ్ యార్డు అనుమతులు రద్దు చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని సీపీఎం నియోజకవర్గ నాయకుడు, ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్ రాజయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ప్రజాసంఘాలతో కలిసి పోరాటాన్ని ఉధృ తం చేస్తామన్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, ట్రస్ట్ సభ్యులు బుధ వారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నల్లవల్లిలో 29వ రోజు రిలే నిరాహార దీక్షలో మాల మహానాడు సంఘం సభ్యులు, ఆ గ్రామానికి చెందిన 70 కుటుంబాల సభ్యులు దీక్ష చేపట్టారు. కొత్తపల్లిలో గ్రామస్తులు రిలే దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు సీపీఎం నాయకులు రాజయ్య, నాగేశ్వర్రావు, నర్సిం హులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డును రద్దు చేయాలంటూ రెండు గ్రామాల ప్రజలతో సం తకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు రాజయ్య మాట్లాడుతూ డంపింగ్ యార్డు వల్ల నష్టం లేకుంటే ప్రజలను ఒప్పించి మెప్పించే ప్రయత్నం ఎం దుకు చేస్తలేరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాంకీ సంస్థ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలన్నారు. గతంలో జవహర్ నగర్లో కూడా ఇలాంటి ఎన్నో అబద్ధాలు చెప్పి అక్కడి ప్రజలకు తీవ్ర నష్టం చేశారని మండిపడ్డారు. ఇటీవల సీపీఎం నాయకులు జవహర్‌నగర్ డంపింగ్ యార్డును క్షేత్రస్థాయిలో పరిశీలించారన్నారు.
అక్కడి ప్రజలు నిత్యం పడరానిపాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఇబ్బందులు గుమ్మడిదల ప్రజలు పడొద్దని పోరాటం చేస్తున్నామన్నారు. మండల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ కోరనున్నామన్నారు. దీనికి నిరాకరిస్తే అసెంబ్లీ ముట్టడి ఉంటుందని హెచ్చరించారు. గుమ్మడిదలలో సీజీఆర్ ట్రస్ట్ సభ్యులు చైర్మన్ చిమ్ముల గోవర్థన్‌రెడ్డితోపాటు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చని పల్లెలో కారుచిచ్చులా డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజలకు అన్యాయం చేయరాదని సూచించారు. కార్యక్రమం లో రైతు జాతీయ నాయకుడు మం ద బలరాంరెడ్డి, మాజీ సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, జేఏసీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి, నాయకులు పుట్ట నర్సింగ్‌రా వు, మంద భాస్కర్‌రెడ్డి, ఆకుల సత్యనారాయణ, సదానందరెడ్డి, కాలకంటీ రవీందర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, ఆంజనేయు లు, సూర్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, నాగేందర్ గౌడ్, కావలి శంకర్‌యాదవ్, వాసుదేవారెడ్డి, చంద్రారెడ్డి, రౌతునరేశ్, నర్సింహులు, మహిపాల్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, మల్లేశ్ గౌడ్, రామకృష్ణ, మధు, శివరాములు, రాజుగౌడ్, కొరివి సురేశ్, యాదగిరి పాల్గొన్నారు.