పాపన్నపేట, ఫిబ్రవరి11 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2021 పర్యవేక్షణ కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. మండల కేంద్రంతోపాటు నాగ్సాన్పల్లి గ్రామాలను బృందం సభ్యులు మాణిక్యం,రాకేశ్, పరిశీలించారు. ఆయా గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, శ్మశానవాటికలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నర్సరీలు, కిచెన్గార్డెన్లు, మరుగుదొడ్లు, రోడ్లు, మురుగు కాల్వలను పరిశీలించారు. గ్రామంలో తడి, పొడి చెత్తను వేరు చేస్తున్న తీరును గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తిగౌడ్, ఎంపీటీసీ సభ్యులు, శ్రీనివాస్, ఉపసర్పంచ్ బాల్‌రాజ్, పంచాయతీ కార్యదర్శి నవీన్, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.
నార్లపూర్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్ పారిశుధ్య సర్వే
నిజాంపేట, ఫిబ్రవరి 11 : స్వచ్ఛ సర్వేక్షణ్ పారిశుధ్య సర్వేలో భాగంగా శుక్రవారం కేంద్ర బృందం సభ్యుడు భరత్ కుమార్, డీపీఎం సురేశ్‌కుమార్ నార్లపూర్ గ్రామాన్ని సందర్శించారు. పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి, పారిశుధ్య పనులైన తడి, పొడి చెత్త సేకరణ, ఇంకుడు గుంతల నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం వంటి తదితర అంశాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామానికి వచ్చిన స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్ర బృందం సభ్యుడు భరత్‌కుమార్‌కు సర్పంచ్ అమరసేనారెడ్డి శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, సర్పంచ్ అమరసేనారెడ్డి, ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఎంపీవో రాజేందర్, టెక్నికల్ అసిస్టెంట్ మమత, నార్లాపూర్, నందిగామ పంచాయతీ కార్యదర్శులు ప్రశాంత్, ఆరిఫ్ హుస్సేన్, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్ రవీందర్, ఆశవర్కర్లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.