పటాన్చెరు/అమీన్పూర్, అక్టోబర్ 17: రాళ్లు, రప్పలు, కంకర మిషన్లు, అటవీ ప్రాంతంగా ఉన్న సుల్తాన్‌పూర్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటుచేసి పరిశ్రమల స్థాపనకు విశేషంగా కృషిచేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మెడికల్ డివైజెస్ పార్కులో పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు భూములు కేటాయించి పరిశ్రమలు స్థాపించి పరిశోధనలు, నూతన ఆవిష్కరణల ను కేసీఆర్ ప్రోత్సహించాలని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ కృషితో ఇక్కడ అనేక పరిశ్రమలు ఏర్పాటై ఉత్పత్తులు తీస్తున్నట్లు తెలిపారు.
సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కులోని ‘హ్యూవెల్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీలో ‘లైయోబీడ్స్, పోర్ట్‌బుల్ మినీ ఆర్టీ, పీసీఆర్ పరికరాలను శుక్రవారం కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తొమ్మిదేండ్ల క్రితం సూల్తాన్‌పూర్ మెడికల్ డివైసెస్ పార్కు ఏర్పాటు చేశామని, దీంతో ఈ ప్రాంతం దశమారిందన్నారు. మెడికల్ డివైజెస్ పార్కుకు ఇప్పుటి వరకు తాను మూడు సార్లు వచ్చినట్లు తెలిపారు. అడవి ఉన్నప్పుడు వచ్చి, పరిశ్రమలు ఏర్పా టు చేసే ముందు, ఉత్పత్తి చేసేటప్పుడు వచ్చినట్లు తెలిపారు. వందల పరిశ్రమలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిచేందుకు కృషిచేసినట్లు చెప్పారు.
సామాన్యులకు అందుబాటులో పరిశోధన ఫలా లు అందించేందుకు కేసీఆర్ ప్రభు త్వం మెడికల్ డివైజర్ పార్కు ఏర్పాటు చేసిందన్నా రు. రెండేండ్ల తర్వాత బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, అప్పుడు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు వ్యాపారవేత్తలను ప్రోత్సహించి, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కలిపిస్తామని కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని మెడికల్ కిట్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమలను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. శాంతా బయోటెక్ వ్యవస్థాకులు పద్మ భూషణ్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, డాక్టర్ హరీశ్, డాక్టర్ శశిధర్, డాక్టర్ రాకేశ్ మిశ్రా, డాక్టర్ లక్ష్మవేమ పలువురు పాల్గొన్నారు.
సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కుకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం కలికారు. ఓఆర్ఆర్ సమీపంలో మెడికల్ డివైజెస్ పార్కుకు వెళ్లే రోడ్డు వద్ద బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శరెడ్డి ఆధ్వర్యంలో భారీగా పటాకులు కాల్చి, శాలువాలు కప్పి కేటీఆర్‌కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆదర్శరెడ్డి, జిన్నారం మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, తొంట అంజయ్య, ఐలాపూర్ మాణిక్ యాదవ్, కృష్ణ, నవీన్, రాజేశ్, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.