జిల్లాల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండాను ప్రజాప్ర తినిధులు, నాయకులు ఆవిష్కరించారు. మెదక్ నియోజకవర్గం లోని నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ జెండాను ఆవి ష్కరించి, జిల్లాకేంద్రంలోని వెస్లీ స్కూల్ మైదానంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభకు తరలి వెళ్లారు.
మనోహరాబాద్ మండలంలో బీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. మనోహరాబాద్‌లో జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గజ్వేల్‌లో జరిగిన సభకు ర్యాలీగా తరలివెళ్లారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పిలుపుతో మండలంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు జెండాను ఆవిష్కరించిన ఆనంతరం నర్సాపూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి తరలివెళ్లారు.
తూప్రాన్, చేగుంట మండలాల నుంచి గజ్వేల్‌లో నిర్వహిం చిన బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి భారీ సంఖ్యలో తరలివెళ్లారు.
– మెదక్ జిల్లా నెట్వర్క్, ఏప్రిల్ 25