రామాయంపేట, జనవరి 17: ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని అందిస్తామని, వార్డుల వసతుల కల్పనకే బస్తీబాట పట్టామని పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి అన్నారు. మంగళవారం వార్డుల పర్యటనలో భాగంగా రామాయంపేట పురపాలికలోని 7వ వార్డులోని గల్లీలను, ఎస్సీ కాలనీని సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పురపాలికలోని 12 వార్డుల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
వార్డుల అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డిల ద్వారా ప్రత్యేక నిధులను సే కరించి అభివృద్ధి చేస్తామన్నా రు. వార్డులో ముఖ్యంగా మురు గు కాల్వలు, సీసీ రోడ్లకే ప్రాధాణ్యత ఇస్తున్నట్లు తెలిపారు. వా ర్డుల్లోని ప్రతి గల్లీలో సీసీ రోడ్డు, మురుగు కాల్వలను నిర్మిస్తామన్నారు. ఎస్సీ కాలనీతో పాటు ప్రతి గల్లీలో పనులు చేస్తామన్నారు. ఇంటింటికీ తాగునీరు ఇ బ్బంది లేకుండా చేస్తామన్నారు. గ్రామ ప్రజలు పనులు చేసే వా రికి సహకరించాలన్నారు.
ఈ వార్డు పర్యటనలో వార్డు కౌన్సిలర్లు దేమె యాదగిరి, చిలుక గంగాధర్, సుందర్‌సింగ్, బొర్ర అనిల్, బీఆర్ఎస్ నాయకు లు పుట్టి యాదగిరి సరాఫ్ శ్యాం సుందర్, దేవుని రాజు, మల్యాల కిష న్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, ఏఈ సాయి రాంరెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కాలేరు ప్రసాద్, శ్రీనివాస్, సురేశ్, మైసయ్య, వెంకటస్వామి ఉన్నారు.