సిద్దిపేట టౌన్, జూలై 31: సిద్దిపేట పాత బస్టాండ్‌ను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్‌రావు రాష్ర్టానికి ఆదర్శంగా నిర్మించి ప్రజలకు అంకితం చేశారు. ప్రజా రవాణా ఆర్టీసీ ఉమ్మడి మెదక్ రీజియన్ పరిధిలోని బస్టాండ్ల వసతులు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకున్నది.
మెదక్ ఆర్టీసీ రీజియన్‌లో అన్ని బస్టాండ్ల కెల్లా సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్ ఉత్తమ అవార్డుకు ఎంపికైంది. ఈ మేర కు ఉత్తమ అవార్డుతోపాటు రూ.5 వేల నగదును ఆర్టీసీ డిపో మేనేజర్ సుఖేందర్‌రెడ్డికి సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ పురుషోత్తంనాయక్ బుధవారం అందజేశారు.అవార్డు రూపంలో వచ్చిన నగదును ఆర్టీసీ కార్మికుల సంక్షేమ కోసం వినియోగిస్తామని మేనేజర్ సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.