మెదక్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్హ్రిత సమాజానికి యువత ఉద్యమించాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ పిలుపునిచ్చారు. గురువారం మెదక్ జిల్లా సంక్షేమ శాఖ, పోలీస్, మాదక ద్రవ్యాల నిర్మూలన శాఖ సమన్వయంతో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం జరుపుకొన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్, సీనియర్ సివిల్ జడ్జి రుబీనాఫాతిమా, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్అండ్బీ ఈఈ సర్దార్‌సింగ్, జిల్లా సంక్షేమాధికారి హైమావతి, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్, మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా పోలీసు యంత్రాంగం, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులతో కలిసి మెదక్ ప్రభుత్వ బాలు ర జూనియర్ కళాశాల గ్రౌండ్స్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన ర్యాలీని జెండాఊపి కలెక్టర్, ఎస్పీ ప్రారంభించారు.
విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, ఆశవరర్లు, మహిళలు, ఉపాధ్యాయులు పాల్గొనగా ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల క్రీడాప్రాంగణం నుంచి రాందాస్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ వ్యతిరేకంగా ప్లకార్డులతో నినాదాలు చేశారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ…యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. యువత డ్రగ్స్‌తో పాటు గుటా, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలన్నారు.
విద్యార్థులకు చదువుతో పాటు సంసారం, క్రమశిక్షణ చాలా కీలకమని పేరొన్నారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రగ్స్హ్రిత సమాజ నిర్మాణానికి అందరూ పనిచేయాలని, డ్రగ్స్ నియంత్రణలో పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. మత్తు పదార్థాలు సేవించిన వారి వివరాలు తెలిస్తే 1908 సమాచారం అందించాలని, సైబర్ నేరాలు అరికట్టేందుకు (1930) సమాచారం అందించాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు, విద్యార్థినీ, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
సిద్దిపేట, జూన్ 26: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి, సీపీ అనురాధ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక నిరోధక దినోత్సవాన్ని పురసరించుకొని గురువారం సిద్దిపేటలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి బాధితులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
జిల్లాలో మాదక ద్రవ్యాలకు లోనై ఇబ్బందులు పడకుండా జిల్లా ప్రభుత్వ దవాఖానలో డ్రగ్ అడిక్షన్ సెంటర్ ద్వారా కౌన్సెలింగ్, వైద్య సేవలు అందిస్తామ న్నారు. మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. అందులో భాగంగా నేడు వివిధ పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.కార్యక్రమంలో అధికారులు, పోలీసుశాఖ సిబ్బంది, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.