వర్గల్, ఆగస్టు 8 : సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయంలో రెండురోజులపాటు జరిగిన క్లస్టర్ లెవల్ అథ్లెటిక్స్ క్రీడలు గురువారంతో ముగిశాయి. తెలంగాణలోని నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నవోదయ విద్యాలయాల నుంచి అథ్లెటిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు(బాల, బాలికలు) వందమందికిపైగా క్రీడాకారులు తరలివచ్చారు. అండర్ 17, అండర్19 విభాగాల్లో కలిపి 84 అంశాల్లో పోటీలు జరిగాయి. క్లస్టర్‌స్థాయిలో ఉత్తుమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 12 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో జరిగే రీజనల్స్థాయికి ఎంపిక చేశారు.
క్రీడల ముగింపు సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలోనే నవోదయ విద్యాలయాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆటలోనైనా, చదువులోనైనా నవోదయ విద్యాలయాల ఒరవడి ఇతర సంస్థలకు లేవన్నారు. విద్యాప్రమాణాలకు, స్కిల్ డెవలప్మెంట్కు నవోదయ విద్యాలయాలు విద్యార్థుల పాలిట నిలయాలుగా మారాయాన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా భావించి ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్ రాజేందర్, నవోదయ ఉపాధ్యాయ బృందం