ఆషాఢమాసం బోనాలతో పల్లెలు, పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొన్నది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, కోలాటాలు, ఘటాలు, తొట్టెల ఊరేగింపుతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఆలయాలను విద్యుత్‌దీపాలతో ముస్తాబు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అందంగా తయారుచేసిన బోనాలతో మహిళలు వీధుల్లో ఊరేగింపు చేపట్టి, ఆలయాలకు చేరుకుని అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలుచోట్ల అన్నదానాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, సంగారెడ్డిలో టీఎస్ హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, అందోల్-జోగిపేటలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వేడుకల్లో పాల్గొని అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకున్నారు. వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరినీ చల్లగా చూడాలని వేడుకున్నారు.
మెదక్ మున్సిపాలిటీ, జూలై 9: తెలంగాణ ప్రజల సంస్కృతి బోనాలు అని, గ్రామ దేవతలు చల్లగా చూడాలని ఊరేగా బోనాల పండుగ జరుపుకొంటారని మెద క్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లో ఆదివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నల్లపోచమ్మకు వైభవంగా బోనా లు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి బోనమెత్తుకొని మహిళలతో కలిసి కొద్దిదూరం నడిచారు. సుభాష్‌రెడ్డి బోరంచమ్మ దేవాలయంలో ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి ప్రత్యేకపూజలు చేశారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు సున్నం నరేశ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఆది సురేందర్, సంఘం నాయకులు సార శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. తారకరామనగర్ కాలనీలో సాయంత్రం నల్లపోచమ్మకు బోనాలు సమర్పించారు. గ్రామ దేవతలైన గట్టమ్మ, బోరంచమ్మ, ముత్యాలమ్మలకు ఆయా వీధుల వారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణ సీఐ వెంకటేశ్ ఆధ్యర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నర్మద, మాజీ కౌన్సిలర్లు శ్రీదర్యాదవ్, అనిల్‌కుమార్, ఏడుపాయల చైర్మన్ బాలగౌడ్, ముదిరాజ్ సంఘం నాయకులు సుధాకర్, ప్రదీప్, నాగరాజు, ఇప్ప భరత్, దుర్గపతి, ఇప్ప కిషన్, ఆది రవి, రాంకిషన్, మంద రాజు, లింగారెడ్డి పాల్గొన్నారు.
సల్లంగా చూడుతల్లీ
అల్లాదుర్గం, జూలై 9: అల్లాదుర్గం, వెంకట్రావుపేట్ తదితర గ్రామాల్లో భక్తుల కోలాహలం మధ్య బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్
మెదక్ మున్సిపాలిటీ, జూలై 9: పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేటకు మండలం నా మాపూర్ తండాకు చెందిన కాట్రోత్ ప్రవీణ్ ఇటీవల ప్రమాదవశాత్తు మృ తి చెందాడు. అతడికి బీఆర్ఎస్ సభ్య త్వం ఉండటంతో రూ.2 లక్షల బీమా మంజూరయింది. ఇందుకు సంబంధించిన చెక్కును ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ఆదివారం క్యాంప్ కార్యాలయంలో పద్మాదేవేందర్‌రెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడుపాయల చైర్మన్ బాలగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు జయరాజ్, ఉమర్, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు సోహేల్ ఉన్నారు.