Disabled Students | ఉత్సాహంగా దివ్యాంగుల క్రీడలు.. ప్రారంభించిన అదనపు కలెక్టర్ నగేష్
Disabled Students | వైకల్యం శరీరానికి, మనసుకు సంబంధించినది కావచ్చు.. కానీ హృదయానికి సంబంధించినది కాదని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్అన్నారు.
Disabled Students | మెదక్ రూరల్, నవంబర్ 29 : విజయానికి వైకల్యం అడ్డంకి కాదని, ప్రతిభ, దృఢ సంకల్పం ముందు వైకల్యం అల్పమైనదిగా కనిపిస్తుందని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. డిసెంబర్ 3న జరుపుకునే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం మెదక్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్టేడియంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల పిల్లల కోసం నిర్వహించిన క్రీడా పోటీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
వివిధ వైకల్యం కలిగిన దివ్యాంగులు ఉత్సాహంగా క్రీడలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. వైకల్యం శరీరానికి, మనసుకు సంబంధించినది కావచ్చు.. కానీ హృదయానికి సంబంధించినది కాదని అన్నారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించి ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. పరుగు పందెం, షార్ట్ ఫుట్, చెస్, జావెలిన్ త్రో, క్యారమ్ , క్రీడలు నిర్వహిస్తున్నామని సత్తా చాటిన వారికి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజు వారి ప్రతిభను గుర్తించి బహుమతి ప్రధానం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, మెదక్ సీడీపీఓ స్వరూప, సంక్షేమ శాఖ సిబ్బంది,దివ్యాంగుల సంక్షేమ శాఖ యూనియన్ నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

Read Also :
Dalit Cook: దళిత మహిళను వంట చేయకుండా అడ్డుకున్న ఆరుగురికి జైలుశిక్ష
Deeksha Divas | తెలంగాణ భవన్లో దీక్షా దివస్.. దీక్షా దివస్‌పై డాక్యుమెంటరీని ఆవిష్కరించిన కేటీఆర్
Ditwa cyclone | దిత్వా తుఫాను ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. Video
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

