రంగుల పండగ అందరి జీవితాల్లో రంగులు నింపాలని కోరుకుంటూ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రంగులు చల్లుకున్నారు. పల్లె, పట్టణం, ఊరూ వాడా రంగులతో నిండిపోయాయి. హాలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రంగుల దుకాణాలు సందడిగా మారాయి. రసాయన రంగుల కంటే సహజ రంగులే మేలని భావించిన ప్రజలు వాటితోనే రంగులాడారు. పాటలు పాడు తూ కేరింతలు కొడుతూ యువత ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ రంగులాడారు. అనంతరం కలకాలం అందరి జీవితాలు రంగులమయం కావాలని భావిస్తూ చిన్నారులకు చక్కర పేర్లు, కుడుకల పేర్లు వేసి ఆశీర్వదించారు.