తొగుట, ఆగస్టు 14: మల్లన్నసాగర్ ప్రాజెక్టులో 9.75 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయని మల్లన్నసాగర్ డీఈఈ శ్రీనివాస్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఆరు రోజుల పాటు తుక్కాపూర్ పంప్‌హౌస్ నుంచి నాలుగు పంపుల ద్వారా పంపింగ్ జరుగుతుందని చెప్పారు.
అందులో నుంచి 0.8 టీఎంసీల నీటిని అదే మోతాదులో కొండపోచమ్మసాగర్‌కు ఎత్తిపోస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 2.6 టీఎంసీలు పంపింగ్ జరిగిందన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మరో నాలుగు రోజులపా టు పంపింగ్ కొనసాగుతుందని చెప్పారు.