రాష్ట్ర ప్రభుత్వం అణగారిన, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని, సీఎం కేసీఆర్ కృషితో మెదక్ జిల్లా అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలుస్తున్నదని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలత, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శినిలతో కలిసి ఆయన జాతీయజెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ పాఠశాలల విద్యార్ధులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి జ్ఞాపికలు అందజేశారు. కలెక్టరేట్ ఆవరణలో ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మెదక్ మండల పరిధిలోని కోంటూరు, రాజ్‌పల్లి శివారులో రూ. 50 లక్షలతో నిర్మించనున్న హోల్‌సేల్, రిటైల్ చేపల మార్కెట్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. 200 మంది మత్స్యకారులకు సభ్యత్వ కార్డులు అందజేశారు.
మెదక్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను ఆర్పించారని, వారి త్యాగాల ఫలితమే మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా మంగళవారం సమీకృత కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవి ష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం స్వాతం త్య్ర సమరయోధులను మంత్రి సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రసంగిస్తూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను మననం చేసుకొని, వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ప్రణాళికలు రూ పొందించుకొని అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కా వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మంత్రి తన ప్రసంగంలో మెదక్ జిల్లాలో చేపట్టిన పథకాలతోపాటు అభి వృద్ధి పనులను వివరించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా దళిత బంధు తెలంగాణాలోనే అమలవుతుందన్నారు. దళితబంధును దశలవారీగా చేపట్టి ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందజేస్తామన్నారు. మెదక్ జిల్లాలో మొదటి విడతలో 256 మందికి రూ.25.60కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రెండో విడతలో 3వేల యూనిట్లకు గ్రౌండ్ చేయడానికి ప్రణాళిక రూ పొందించామన్నారు. మెదక్, ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గంలో 1203 లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు.
దివ్యాంగుల సంక్షేమం..
మెదక్ జిల్లాలో 1076 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణు లు, బాలింతల, 6 ఏండ్లలోపు పిల్లలకు పౌషికాహారంతోపాటు బాలామృతం పంపిణీ చేస్తున్నామన్నారు. గృహహింస నిరోధక చట్టం ప్రకారం సఖీ కేంద్రం ఏర్పాటు చేసి బాధితులకు సేవలు అందిస్తున్నారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వివా హ ప్రోత్సాహక బహుమతి, ఆర్థిక పునరావాసంతోపాటు వీల్‌చైర్, చేతి కర్రలు, బ్యాటరీ సైకిళ్లు అందస్తున్నట్లు తెలిపారు.
వైద్యారోగ్యశాఖ…
మాతాశిశు మరణాలను నియంత్రించడంలో భాగంగా జూన్ 2, 2017 నుంచి ఇప్పటి వరకు 32వేల 868 మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చామన్నారు. కంటి వెలుగులో 40 వైద్యబృందాలతో 4 లక్షల 52వేల మందికి పరీక్షలు చేసి, 47వేల మందికి కంటి అద్దాలను పంపిణీ చేశామన్నారు. కరోనా వ్యాక్సినేషన్లో భా గంగా 3,79,297 మందికి బూస్టర్ డోస్ వేశామని తెలిపారు. దాదాపు 84 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతు న్నాయన్నారు. కుష్టు, టీబీ బాధితులకు ప్రత్యేక చికిత్స చేయిస్తు న్నట్లు తెలిపారు. 102, 108 అంబులెన్స్ ద్వారా రోగులను సకాలంలో దవాఖానలకు తరలిస్తున్నట్లు వివరించారు.
వీఆర్ఏల సర్దుబాటు..
మెదక్ జిల్లాలో పనిచేస్తున్న 616 వీఆర్ఏలను జీవో ఎంఎస్ 81 ప్రకారం రెవెన్యూ సర్వీస్ నుంచి తప్పించి, వివిధ శాఖల్లో విలీనం చేశామన్నారు. వారిలో 114 మంది జూనియర్ అసిస్టెంట్లు, 65 మంది రికార్డు అసిస్టెంట్లు, 437 వీఆర్ఏలను లాస్ట్‌గ్రేడ్ సర్వీసులుగా మార్చి వివిధ శాఖలకు బదిలీ చేశామన్నారు. రెండు ఆర్టీసీ డిపోల్లో పని చేస్తున్న 468 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చినట్లు మంత్రి తలసాని వివరించారు.
శాంతిభద్రతలు…
శాంతి భద్రతల నిర్వహణ సమర్థవంతంగా జరిగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమన్నారు. మహిళలు, పిల్లల భద్రత కోసం జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేశామని, భరోసా భవన నిర్మాణానికి రూ. 2.5 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆధునిక పరికరాలతో సైబర్ నేరాలను నియంత్రిస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.
వ్యవసాయం…
ప్రస్తుత వానకాలంలో 3 లక్షల 10వేల ఎకరాల్లో వరి పంట సాగును అంచనా వేశామన్నారు. మెదక్ జిల్లాలో వరి, పత్తి పం టలు ప్రధానంగా పండిస్తారని తెలిపారు. రైతు వేదికలో పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతుసదస్సు నిర్వహిస్తు న్నట్లు పేర్కొన్నారు. రైతుబంధులో 2 లక్షల 53వేల మంది రైతులకు రూ.169.34 కోట్లు జమ చేశామని, 4734 మంది రైతు లు మరణించగా, రైతుబీమాగా రూ.236.70 కోట్లు జమ చేశామన్నారు. మార్చి, పంట నష్టపరిహారంగా రూ.12.26 కోట్లు మంజూరయ్యాయని, ఇప్పటి వరకు రూ.8.86 లక్షలను 98 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు.
పశు సంవర్ధకశాఖ…
గొర్రెల అభివృద్ధి పథకం మొదటి విడతలో 12,997 గొర్రెల యూనిట్లను రూ.128.37 కోట్ల సబ్సిడీపై పంపిణీ చేశామని, రెండో విడతగా 7,184 యూనిట్లకు 2548 మంది లబ్ధిదారులు తమ వాటా చెల్లించారన్నారు. ఇప్పటివరకు 192 లబ్ధిదారుల కు 75శాతం సబ్సిడీపై గొర్రెల యూనిట్లు అందజేశామ న్నారు. ప్రతి లబ్ధిదారుడికీ గొర్రెల యూనిట్ల ఇస్తామన్నారు. 1199 పాడి పశువులను 5.44 కోట్ల సబ్సిడీపై పంపిణీ చేశామన్నారు.
మత్స్యసంపద…
మెదక్ జిల్లాలో 279 సహకార సంఘాల్లో 16,200 మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం రిజర్వాయర్, చెరువులు 1617 ఉండగా, అన్ని జలాశయాల్లో చేపల పెంపకం చేపట్టామన్నారు. మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఐఎఫ్‌డీఎస్ పథకంలో రూ. 23.48 కోట్ల సబ్సిడీ నిధులు విడుదల చేశామన్నారు.
స్వాతంత్య్ర వేడుకల్లో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలత, వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ రోహిణిప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, డీఎస్పీ ఫణిందర్, జడ్పీ ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, తహసీల్దార్ కె.శ్రీనివాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు పాల్గొన్నారు.