గురువారం 04 మార్చి 2021
Medak - Jan 24, 2021 , 00:16:07

రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ

రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ

రామాయంపేట, జనవరి23 : అయోధ్య రామమందిర నిర్మాణం కోసం హిందూ బంధువులు నిధుల సేకరణ ను చేపడ్తున్నారు. శనివారం పట్టణంలోని వాణిజ్య, వర్తక దుకా ణాదారులతో పాటు రాజకీయ నాయకులు అధికారులు, ఇంటింటికీ వెళ్లి మందిర నిర్మాణం కోసం  సహాయం చేయాలని కోరుతున్నారు. రామాయంపేట మున్సిపల్‌  చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌ రూ.25116లు అందజేశారు. వైస్‌చైర్‌పర్సన్‌ పుట్టి విజయలక్ష్మి-యాదగిరి దంపతులు రూ.16116లు అందజేశారు.

  నిజాం పేటలో శోభాయాత్ర

నిజాంపేట,జనవరి23: మండల కేంద్రంలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిజాంపేట కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిజాంపేట కమిటీ సభ్యులు  బైక్‌ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయ్‌కుమార్‌,సర్పంచ్‌ అనూష, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిజాంపేట కమిటీ సభ్యులు,గ్రామస్తులు ఉన్నారు.

కొల్చారంలో బైక్‌ ర్యాలీ ...

కొల్చారం,జనవరి23: మండల పరిధిలోని పలు గ్రామాల్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శనివారం విరాళాలు సేకరించారు. కొల్చారంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మంజుల సత్యనారాయణగౌడ్‌  పాల్గొన్నారు. 


VIDEOS

logo